BILL | పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా

BILL | పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా
BILL | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నిన్న (శుక్రవారం) ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుపై ప్రతిష్టంభన నేపథ్యంలో పార్లమెంటు ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మూడు రోజుల పాటు జరిగిన ప్రత్యేక సమావేశాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో, లోక్‌సభ సీట్ల పెంపు ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభలో 278 మంది అనుకూలంగా, 211 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. ఈ బిల్లులు దక్షిణ, చిన్న రాష్ట్రాల ప్రభావాన్ని తగ్గించేలా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మహిళా బిల్లు వీగిపోవడంతో, దానికి సంబంధించిన డీలిమిటేషన్ బిల్లు, యూనియన్ టెరిటరీస్ లాస్ (సవరణ) బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఏప్రిల్ 16న ప్రారంభమైన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు, తీవ్రమైన రాజకీయ విభేదాల మధ్య ముగిశాయి.
