డిమాండ్ల సాధనకు నల్లబెల్లిలో నిరసన జ్వాల

డిమాండ్ల సాధనకు నల్లబెల్లిలో నిరసన జ్వాల
పీఆర్సీ సహా సమస్యల పరిష్కారానికి నల్ల బ్యాడ్జీలతో ధర్నా – తహసిల్దార్‌కు వినతి
నల్లబెల్లి , ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నల్లబెల్లి మండలంలో నిరసన కార్యక్రమం జరిగింది. టీజీ ఈజెఏసీ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జూన్ 2లోగా పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను రెండు విడతల్లో చెల్లించాలని,మే 1 నుంచి హెల్త్ కార్డు అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్‌కు సమర్పించారు.ఈ కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండలానికి చెందిన వంద మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
