అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణకు డాక్టరేట్..

అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణకు డాక్టరేట్..
యడ్లపాడు, ఆంధ్రప్రభ : స్థానిక చౌడవరంలోని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో మాధమాటిక్స్ అండ్ హ్యుమానిటిస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న కిలారు జయ లక్ష్మీనారాయణకు కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (డీమ్డ్ విశ్వవిద్యాలయం) గుంటూరు డాక్టరేట్ ప్రదానం చేసింది. అధ్యాపక వృత్తిలో 28 సంవత్సరాలు అనుభవం గడించిన శ్రీ కిలారు జయ లక్ష్మీనారాయణ “కంట్రిబ్యూషన్స్ ఆన్ ప్రైమ్, జాకబ్సన్ అండ్ బ్రౌన్ మెకే రాడికల్స్ ఫర్ నియర్ రింగ్స్” అనే అంశం పై కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (డీమ్డ్ విశ్వవిద్యాలయం) కు చెందిన డా.వి.బి.వి.ఎన్.ప్రసాద్ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకుగాను పి.హెచ్.డి., పొందారు.
ఈ సందర్భంగా కళాశాలలో పి.హెచ్.డి కలిగిన స్టాఫ్ మొత్తం 174 మంది వున్నారని, పరిశోధనలను కళాశాల ప్రోత్సహిస్తుందని కళాశాల అధ్యక్షులు డా.రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. యడ్లపాడు మండలం కొత్త సొలస గ్రామానికి చెందిన శ్రీ కిలారు జయ లక్ష్మీనారాయణ పి.హెచ్.డి. పొందిన సందర్భంగా కళాశాల కార్యదర్శి శ్రీ రాయపాటి గోపాలకృష్ణ, ట్రెజరర్ డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ డా.కొల్లా శ్రీనివాస్, డైరెక్టర్, అకడమిక్స్ అండ్ ఆర్&డి డా.కొమ్మినేని రవీంద్ర, డైరెక్టర్, ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డా. ఎన్.వి .శ్రీనివాసరావు, ఎం & హెచ్ విభాగాధిపతి డా.కె.ఎస్. బాల మురుగన్, గ్రామస్తులు, తదితరులు ఆయనను అభినందించారు.
