అగ్ని ప్రమాదాలపై గృహవాసులకు అవగాహన

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని సగర వీధి ప్రాంతంలో గృహవాసులకు అగ్ని ప్రమాదాలపై పరకాల ఫైర్ స్టేషన్ ఆఫీసర్ వి భద్రయ్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ భద్రయ్య మాట్లాడుతూ ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నమని పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, గ్రామీణ ప్రాంతాలలో అవగాహన సదస్సులు మాక్ డ్రిల్స్ అలాగే విద్యుత్ భద్రత, ఎల్పీజీ వినియోగం, గ్యాస్ లీకేజీ నివారణ, అగ్ని ప్రమాద సమయంలో పాటించవలసిన చర్యలపై ప్రజలకు వివరంగా సూచనలు అందించారు.

ఏప్రిల్ 14 నుండి 20 వరకు ఫైర్ సర్వీస్ వీక్ వారోత్సవాలలో భాగంగా 16-04-2026 గురువారం రోజున పరకాల పట్టణంలోని సగర వీధి కాలనీలో గృహవాసులకు కరపత్రాల పంపిణీ, గోడలకు పోస్టర్లు అంటించి ఇండ్లలో జరిగే గ్యాస్ ప్రమాదాల గురించి మరియు షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎఫ్ పి కృష్ణ కుమార్, ఎఫ్ ఎఫ్ టి జి గణేష్ , ఎఫ్ ఎఫ్ సిహెచ్ దిలీప్, ఎఫ్ ఎఫ్ డి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply