Governor | కేంద్ర రాజకీయాల దిశగా…

Governor | కేంద్ర రాజకీయాల దిశగా…
Governor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌కు సమర్పించిన రాజీనామాను ఆమోదించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.
ఇటీవల ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్‌సభ, రాజ్యసభ ఎంపీగా అన్ని చట్టసభల్లో పనిచేయాలనే ఆకాంక్షతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నితీశ్ రాజీనామాతో బీహార్‌లో కొత్త రాజకీయ పరిణామాలకు మార్గం సుగమమైంది.
