అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం

అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం

-రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు
-భూపాలపల్లిలో వైభవంగా 135వ జయంతి వేడుకలు
-పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్ఆర్, కలెక్టర్, ఎస్పీ

భూపాలపల్లి,ఆంధ్రప్రభ: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఎస్సీ అబివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డా.బాబాసాహెబ్ 135వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే జీఎస్ఆర్ అధ్యక్షత జరుగగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సంకీర్త్ హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎస్ఆర్ మాట్లాడుతూ.. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు అనన్య సామాన్యమని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే నేడు అందరికీ సమాన హక్కులు లభిస్తున్నాయని కొనియాడారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపిన బాటలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీవో హారికృష్ణ, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీపీఆర్ఓ శ్రీనివాస్ , ఎస్సీ కార్పొరేషన్ అధికారి ఇందిర, డీసీసీ అధ్యక్షులు కర్ణాకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, 30 వార్డు కౌన్సిలర్ బొడ్డు అశోక్ ,మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా అధికారులు , వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply