విద్యుత్ షాక్ కు తో పాడి పశువు మృతి

విద్యుత్ షాక్ కు తో పాడి పశువు మృతి
బోధన్, ఆంధ్రప్రభ: పొలంలో గడ్డి మేయడానికి వెళ్లి విద్యుత్ షాక్ కు గురై పాడి పశువు మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం బోధన్ మండలం సంఘం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన అంజి తన గేదలను మేపడానికి పొలం తోలుకు వెళ్ళాడు. పశువులు మేసుకొంటూ వెళుతుండగా విద్యుత్ వైరు తగలడంతో గేదె కిందపడి కొట్టుకోని మరణించింది. విద్యుత్ షాక్ కు గురైన పశువు గిలగిలా కొట్టుకోవడం గమనించిన మిగిలిన పశువులు ఒక్కసారిగా దాని వద్దకు చేరే ప్రయత్నం చేశాయి. ఇది గమనించిన పశువుల కాపరులు మిగిలిన పశువులను దూరంగా కొట్టివేసి విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గత వారం నుంచి విద్యుత్ లైన్లు కిందికి స్తంభాల నుంచి కిందికి జారాయని ట్రాన్స్ కో అధికారులకు సమాచారం అందించిన వారు పట్టించుకోలేదని రైతులు పేర్కొన్నారు. ఫలితంగా విలువైన పశువును కోల్పోవలసి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
