బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరఫ్ పోచారం‌‌ – బీఆర్ఎస్ నాయకులు

బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరఫ్ పోచారం‌‌ – బీఆర్ఎస్ నాయకులు

వర్ని,ఆంధ్రప్రభ: బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సిద్ద హస్తుడని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి అధికారం లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరి ప్రస్తుతం ఆ పార్టీ నాయకులనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. పదవి వ్యామోహం, కాంట్రాక్టుల పేరుతో దోచుకోవడం పోచారంకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడంతో దానిని తప్పించుకోని తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చే ఎత్తుగడలో భాగo గానే పోచారం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోయి కాంగ్రెస్ లో చేరారన్నారు. ఆయన కుమారుడికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి బీఆర్ఎస్ కట్టబెట్టిందని గుర్తు చేశారు. ఆయన కుమారుల కంటే ముందు నుంచి పార్టీలో ఆయనతో ఉన్న మండల స్థాయి నాయకులను ఎవరిని పోచారం ఎదగనివ్వలేదని గుర్తు చేశారు. ఆయన వ్యాపారాలు, కాంట్రాక్టులు కోసమే ఆయన రాజకీయాలు చేస్తారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బాన్సువాడ నియోజకవర్గ నాయకులు యలమంచిలి శ్రీనివాస్ రావు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply