Youth | మార్కెట్‌లోకి బ‌జాజ్ ప‌ల్స‌ర్ 180 బైక్‌

Youth | మార్కెట్‌లోకి బ‌జాజ్ ప‌ల్స‌ర్ 180 బైక్‌

Youth | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బజాజ్ పల్సర్ బైక్‌లకు యువతలో ఎప్పుడూ యమా క్రేజ్ ఉంటుంది. పల్సర్ కు యువతలో ఉన్న క్రేజే వేరు. మంచి పికప్ తో ఉండే ఆ బైక్ పై తిరిగేందుకు యువత ఎక్కువగా ఉత్సుకత చూపిస్తుంటుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన డిజైన్, మరియు మెరుగైన మైలేజ్ వల్ల ఇవి నిత్యం మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. స్పోర్టీ లుక్, సుదూర ప్రయాణాలకు సౌకర్యం, మరియు వేగవంతమైన ప్రయాణానికి పల్సర్ సిరీస్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.

భార‌త్‌లోని బ‌జాజ్ సంస్థ‌ బజాజ్ పల్సర్ 180 బైక్ విక్ర‌యాల‌ను గ‌తంలో నిల‌పివేసింది. అయితే మంచి ఆద‌ర‌ణ ఉన్న ఈ బైక్‌ను మ‌ళ్లీ మార్కెట్‌లోకి తిరిగి తీసుకొచ్చింది. కంపెనీ దీన్ని రూ. 1.22 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది. ఈ బైక్‌ను ఒక విలక్షణమైన పేరుతో పరిచయం చేశారు. కొనుగోలుదారుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని కొన్ని కాస్మెటిక్ అప్​గ్రేడ్​లతో పాటు కొంగొత్త ఫీచర్లతో తీసుకొచ్చారు.

2026 బజాజ్ పల్సర్ 180 డిజైన్​, ఫీచర్లు:

కొత్త బజాజ్ పల్సర్ 180లో ఫుల్ LED హెడ్‌ల్యాంప్, LED ఇండికేటర్లు ఉన్నాయి. ఇంకా వీటికి ఇప్పుడు కొత్త గ్రాఫిక్స్ తోడయ్యాయి. ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ కన్సోల్ కూడా అమర్చారు. ఈ అప్‌డేట్‌ల ముఖ్య ఉద్దేశం, మోటార్‌సైకిల్ ప్రత్యేకమైన స్టైలింగ్‌ను కాపాడుతూనే దానిని ఆధునికంగా తీర్చిదిద్దడం.

Leave a Reply