మహిళల అభివృద్ధి దేశ అభివృద్ధి

మహిళల అభివృద్ధి దేశ అభివృద్ధి

  • బీజేపీ నేత కనుకుంట్ల భాగ్యలక్ష్మి

కరీమాబాద్, ఆంధ్రప్రభ : మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశంలో మహిళల రాజకీయ సాధికారతకు మార్గం సుగమమవుతుందని బీజేపీ నాయకురాలు కనుకుంట్ల భాగ్యలక్ష్మి రంజిత్ కుమార్ అన్నారు.

శనివారం ఆమె మాట్లాడుతూ, ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ ద్వారా లోకసభలో మహిళలకు గణనీయమైన ప్రాతినిధ్యం కల్పించబడుతుందని తెలిపారు. లోకసభ స్థానాల పెంపు, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ అమలు కావడం శుభ పరిణామమని పేర్కొన్నారు.

ఈ బిల్లును రాబోయే ఎన్నికలకు ముందే అమల్లోకి తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణ కూడా దేశంలోని కోట్లాది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబమని అన్నారు.

దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక, క్రీడలు, రక్షణ, సంగీత, కళారంగాలలో మహిళలు విశేషంగా రాణిస్తున్నారని కొనియాడారు. మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం పురోగమిస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply