అరకు వద్ద విషాదం…

అరకు వద్ద విషాదం…
- సెల్ఫీ మోజుతో ముగ్గురు బాలికల మృతి
అనంతగిరి, ఆంధ్రప్రభ : అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని మలంగుమ్మి వాటర్‌ఫాల్స్ వద్ద హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సరదాగా పిక్నిక్‌కు వెళ్లిన ఐదుగురు బాలికల్లో ముగ్గురు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.
మృతులు త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16)గా గుర్తించారు. వీరు సెల్ఫీ తీసుకుంటూ ఉండగా జారిపడి నీటిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మిగతా ఇద్దరు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. వాటర్‌ఫాల్స్ ప్రాంతాల్లో రాళ్లు జారుడు స్వభావం కలిగి ఉండటం, భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు సూచిస్తున్నారు. పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
