యోగద్వారా శరీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుంది

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : యోగ ద్వారా శరీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయుష్ యోగ శిక్షకులు గుడ్లవర్ విట్టల్ ఆన్నారు.శుక్రవారం నాడు ప్రజాపాలన,ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ హోమియోపతి డే సందర్భంగా ఆయుష్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులకు,యువకులకు యోగ సాధన చేయించడమే కాకుండా,అయ రకాల యోగ పద్ధతి ద్వారా అయ రకాల రోగాలను నివారించడమే కాకుండా,రోగాలు దరిచేరకుండా చేసుకోవచ్చన్నారు.రూపాయి ఖర్చు లేని యోగను వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రజలందరూ యోగ సాధనను జీవితంలో ఒక భాగంగా చేసుకుని మానసిక ప్రశాంతతను,ఆరోగ్యానికి కాపాడుకోవడమే కాకుండా,వ్యాధులు దరిచేయకుండా జాగ్రత్త పడాలన్నారు.
