అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన..

కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల మూడవ అంగన్వాడీ కేంద్రం లో గురువారం చిన్నారి పిల్లలకు “అన్నప్రాసన” కార్యక్రమం నిర్వహించారు గ్రామానికి చెందినb నేడూరి మహేష్ గంగజల దంపతుల కుమారుడు కు స్థానిక ఎంపీపీ ఎస్ పాఠశాల హెచ్ఎం బొమ్మిడి మహేశ్వర్ ఉపాధ్యాయులు అఖిల్ అంజుమ్ స్థానిక అంగన్వాడీ కేంద్రం టీచర్ నేదూరి విజయనిర్మల ఆధ్వర్యంలో అన్నప్రాసన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం బి మహేశ్వర్ మాట్లాడుతూ.. మురుకులు, గ్రుడ్లు, బాలామృతం పండ్లు, పౌష్టికహారం సమతుల్య ఆహారం తీసుకోవడం వలన పిల్లలు, గర్భిణీ మహిళలు బాలింతలు కిషోర బాలికలు ఆరోగ్యం గా ఉంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం లో ప్రముఖ న్యాయవాది నేదురి జాకబ్ తల్లులు నేడూరి మంజుల, బోదాసు జల మారంపెల్లి లక్ష్మి మారంపెల్లి మౌనిక కొత్తూరి లక్ష్మి, కొమ్ము వసంత తదితరులు పాల్గొన్నారు.
