bcci rules| ఐపీఎల్‌లో అమ‌లు

bcci rules| ఐపీఎల్‌లో అమ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో బీసీసీఐ కొత్త రూల్స్ ప్ర‌వేశ‌పెట్టింది. బెంచ్‌కు ప‌రిమిత‌మైన ఆట‌గాళ్ల విష‌యంలో క‌ఠిన ఆంక్ష‌లు విధించింది. వారు ఇష్టానుసారం స్టేడియంలోకి రావ‌డం వ‌ల్ల మ్యాచ్ స‌మ‌యం వృథా అవుతుంద‌ని ఈ నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. ఆట సమయం వృథా కాకుండా ఉండేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం.. అవేమిటంటే…

  • మ్యాచ్ జరుగుతున్నప్పుడు బెంచ్‌పై ఉన్న ప్లేయర్లు స్టేడియం చుట్టూ ఇష్టానుసారంగా తిరగడానికి వీల్లేదు.
  • జట్టు యాజమాన్యం అందించిన 16 మంది ఆటగాళ్ల జాబితాలో లేని వారు ఎవరూ మైదానంలోకి ప్రవేశించకూడదు.
  • సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు పదే పదే డ్రింక్స్, బ్యాట్లు, గ్లోవ్స్ లేదా డగౌట్ నుంచి సందేశాలను మైదానంలోకి తీసుకురావొద్దు.
  • కేవలం వికెట్ పడినప్పుడు లేదా బౌండరీ అంచున మాత్రమే ఆటగాళ్లకు డ్రింక్స్ ఇవ్వాలి.
  • అంపైర్ల అనుమతి లేకుండా మైదానంలోకి పానీయాలు తీసుకురాకూడదు.
  • స్టేడియంలోకి వచ్చే ఏ ఆటగాడైనా కచ్చితంగా క్రికెట్ దుస్తులు ధరించి ఉండాలి.
  • సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌లుగా లేని ఆటగాళ్లు బౌండరీ, కంచె మధ్య ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా టీమ్ ట్రైనింగ్ బిబ్స్ ధరించాలి.

Leave a Reply