రూ. 3.50 లక్షలతో ప్రహరీ గోడక నిర్మాణానికి భూమి పూజ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని రజక సంఘానికి ఎలక్షన్స్ లో బాగంగా ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ రూ . 3.50 లక్షలతో గురువారం రజక సంఘం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో, రాజ్యసభ సభ్యులు కె.ఆర్ సురేష్ రెడ్డి కేటాయించిన ప్రత్యేక నిధులచే ప్రహరీ గోడకు రూ. 3 లక్షల 50 వేలు మంజూరు చేసుకొని దాంట్లో భాగంగా ప్రహరీ గోడకు సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్,ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, బిఆర్ఎస్ నాయకులు, రజక సంఘం,సభ్యుల ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు.

సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ఎలక్షన్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రజక సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.బాల్కొండ నియోజకవర్గ శాసనసభ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి కి, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సర్పంచ్, ఉప సర్పంచ్ లను శాలువలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్,టౌన్ అధ్యక్షులు నరేందర్, అహ్మద్,సుభాష్ గౌడ్,బద్రి, మహేందర్,బద్దం రాజేశ్వర్,అక్షయ్, నాగేష్, భూమేశ్వర్, బిఆర్ఎస్ నాయకులు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply