శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి ప్రత్యేక పూజలు..

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి ప్రత్యేక పూజలు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం మల్లికార్జున స్వామి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకోవడం జరిగింది. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులకు కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.
ఆలయంలో పేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు రెండు ప్రజలు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ నిర్వాహకులు వేద పండితులు పాల్గొన్నారు.
