Assault | కేసు నమోదు..

Assault | కేసు నమోదు..

Assault | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కలకలం రేగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆచంట మండలంలోని ఓ మేజర్ పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిరాణ షాపునకు వచ్చిన ఆరేళ్ల బాలికపై సుమారు 60ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం.

ఈ ఘటనపై బాధిత చిన్నారి తల్లిదండ్రులు ఆచంట పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారిని వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply