మండెల గూడెంలో చలివేంద్రం ప్రారంభం..

మండెల గూడెంలో చలివేంద్రం ప్రారంభం..
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : వేసవికాలంలో ప్రజల దాహం తీర్చేందుకు రఘునాథపల్లి మండలం మండలగూడెం (ఆటో స్టాండ్) పాల కేంద్రం దగ్గర గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈచలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంబించారు.
వివిధ పనుల కో సం ఇంటి భయటకు వెళ్లే ప్రయాణికులకు, ప్రజలకు, మారుమూల గ్రామాల నుండి ఇక్కడికి వచ్చే ప్రజలకు ఈ చలివేంద్రం ఎంతో మందికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈకార్యక్రంమలో పంచాయితీ కార్యదర్శి రమేష్. కరోబర్ శంకర్ వార్డ్ నెంబర్ ముప్పిడి లక్ష్మణ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
