High Schools | పేద ప్రజల విద్యా దీపం ఎస్ కేపీవీ…

High Schools | పేద ప్రజల విద్యా దీపం ఎస్ కేపీవీ…

ఎంపీ కేశినేని చిన్ని …

High Schools | విజయవాడ, ఆంధ్రప్రభ : పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థుల కోసం తక్కువ ఫీజులతో అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్న విద్యాసేవా సంస్థ ఎస్. కె. పి. వి. వి. హిందూ హై స్కూల్స్ గ్రూప్ అని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. హిందూ హై స్కూల్స్ కమిటీ ఆధ్వర్యంలో జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ ను ఆదివారం ఎంపీ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో రాజధానిగా ఎదుగుతున్న అమరావతి ప్రాంతానికి ఈ స్కూల్ మణిహారంగా ఉంటుందన్నారు. ఆధునిక సమాజ అవసరాలకు తగినట్లుగా నైపుణ్యాల విద్యకు ప్రాధాన్యతనిస్తూనే విలువలు కలిగిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు హిందూ హైస్కూల్స్ కమిటీ చేస్తున్న సేవను ప్రశంసించారు. క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్ వంటి అధునాతన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు నేర్పించడానికి స్కూలు చేసిన ఏర్పాట్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి యాజమాన్యాన్ని అభినందించారు.

High Schools | చాలా గొప్ప స్థానాల్లో ఉన్నారు..

High Schools |

అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందిస్తున్న హిందూ హై స్కూల్ కమిటీ విద్యా సేవకు అంకితమైందన్నారు. దేశ విదేశాల్లో హిందూ హై స్కూల్స్ విద్యార్థులు చాలా గొప్ప స్థానాల్లో ఉన్నారని, వారి సహకారంతో అమరావతి ప్రాంతాన్ని మరింత గొప్ప విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యాబోధనతోపాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కమిటీ యాజమాన్యాన్ని అభినందించారు.

High Schools |

జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ రాష్ట్రంలోనే 120 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉన్న ఏకైక సంస్థ హిందూ హైస్కూల్ కమిటీ అన్నారు. హిందూ హై స్కూల్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు టి. శేషయ్య గోపిశెట్టి మల్లయ్య మాట్లాడుతూ తమ సంస్థ అధునాతనంగా ప్రవేశపెడుతున్న కోర్సుల గురించి వివరించారు. విజయవాడ పరిధిలో ఆరున్నర ఎకరాల సువిశాలమైన ప్రాంగణం ఉన్న ఏకైక స్కూల్ తమదే అన్నారు.

High Schools |

రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ ఎం.ఎస్ బేగ్, రాష్ట్ర దూదేకుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చెన్నుపాటి శ్రీనివాసరావు, స్కూల్ ప్రిన్సిపాల్ పి. శ్యామల, హిందూ హై స్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి. నారాయణ రావు, స్కూల్ ఇన్చార్జి సెక్రటరీ డాక్టర్ టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

High Schools |

CLICK HERE TO READ MORE : సాంఘిక సంక్షేమ స్ఫూర్తి ప్ర‌దాత‌..

CLICK HERE TO READ MORE

Leave a Reply