తొర్రూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..

తొర్రూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..
- తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్
తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, స్థానిక వార్డు కౌన్సిలర్ చాపల బాపురెడ్డి తో కలిసి వార్డులోని దబ్బా తండాలో పర్యటించి మంచి నీటి సరఫరా, విద్యుత్ దీపాలు,పారిశుద్ధ్య పనుల పై వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలకు మంచి నీటి సరఫరా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని,పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేయాలని, వీధి దీపాలు ఎప్పటికప్పుడు వెలిగించాలని పట్టణంలో అన్ని వార్డులలో మంచి నీటి సరఫరా, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల సహకారంతో మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు ఉమేష్,మీనేశ్వర్, రవిందర్ సిబ్బంది పాల్గొన్నారు.
