చిట్యాల కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్

చిట్యాల కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపల్ కమిషనర్ గా దండు శ్రీనివాస్ ఇటీవల పదవి విరమణ చేయడంతో బుధవారం నాడు ఏ. రంజిత్ కుమార్ మున్సిపల్ కమిషనర్ గ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈయన నకరికల్ పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కమీషనర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఇంటి పన్ను, నల్ల పన్ను వాణిజ్య సముదాయం దుకాణాలు పనులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కమిషనర్ కోరారు. ఏప్రిల్ 30 లోపు పన్నులు చెల్లించి ప్రభుత్వం కల్పించిన రాయితీని పొందాలని పట్టణ ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు .
