inter| జూన్ 1 నుంచి కాలేజీలు

inter| జూన్ 1 నుంచి కాలేజీలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఇంటర్ విద్యార్థులను తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అలర్ట్ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడామిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. జూన్ 1న ఇంటర్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. 2026-27 విద్యా సంవత్సరంలో 224 రోజులు కాలేజీ పనిదినాలు ఉంటాయని పేర్కొంది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 9 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు, అక్టోబర్ 10 నుండి 21 వరకు దసరా సెలవులు ఉంటాయి. సంక్రాంతి సెలవులు 2027 జనవరి 13 నుంచి 17 వరకు ఉండనున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కూడా ఇంటర్ బోర్డు ప్రకటించిన ప్రభుత్వ సెలవు దినాలను పాటించాలని, క్యాలెండర్‌ను ఖచ్చితంగా అనుసరించాలని కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాలు (అడ్మిషన్లు) జరపాలని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. గత కొన్నేళ్లుగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం… ఏప్రిల్ 10వ తేదీ లోపే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్టుగా సమాచారం

తెలంగాణ ఇంటర్ 2026-27 ముఖ్యమైన తేదీలు:
కాలేజీల ప్రారంభం: జూన్ 1, 2026 (ఫస్టియర్, సెకండియర్).
అర్థ వార్షిక పరీక్షలు (Half-Yearly): అక్టోబర్ 3 – 9, 2026.
దసరా సెలవులు: అక్టోబర్ 10 – 21, 2026.
సంక్రాంతి సెలవులు: జనవరి 13 – 17, 2027.
ప్రీ-ఫైనల్ పరీక్షలు: జనవరి 18 – 23, 2027.
ప్రాక్టికల్ పరీక్షలు: జనవరి 2027 చివరి వారం.
థియరీ పరీక్షలు: ఫిబ్రవరి 2027 చివరి వారం.
వేసవి సెలవులు: మార్చి 28 – మే 30, 2027.
తదుపరి విద్యా సంవత్సరం (2027-28) ప్రారంభం: మే 31, 2027.
