నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి

నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి
- కైలాస్ శ్రీనివాస్ గుప్తా డిమాండ్
కామారెడ్డి, ఆంధ్రప్రభ ; నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సంతోష్ కుమార్ గుప్తా పై ఒక వర్గం వారు భౌతిక దాడికి పాల్పడటం అత్యంత విచారకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ కైలాస్ శ్రీనివాస్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:
సమాజానికి సేవ చేసే వైద్యులపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యంలో ఆందోళనకరం.
డాక్టర్ సంతోష్ కుమార్ పై అకారణంగా దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తులను పోలీసులు తక్షణమే గుర్తించి, అరెస్టు చేయాలి. బాధ్యులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, చట్టపరంగా తగిన శిక్ష పడేలా చూడాలి.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్మల్ పట్టణంలో శాంతిభద్రతలను కాపాడాలని పోలీసు శాఖను కోరారు. వైద్యులకు, ఆర్యవైశ్య సమాజానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
