ఘనంగా ఎంవీ కృష్ణారావు శత జయంతి వేడుకలు…

ఘనంగా ఎంవీ కృష్ణారావు శత జయంతి వేడుకలు…

అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ : ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ పునర్నిర్మాత స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం స్థానిక వంతెన సెంటరులో కృష్ణారావు విగ్రహానికి శత జయంతి కమిటీ ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం కమిటీల ప్రతినిధులు, మండలి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజశేఖర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య), డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాధ్ ప్రసాద్, టీసీ అధ్యక్షులు రేపల్లె రవీంద్ర, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్లు యర్రంశెట్టి సుబ్బారావు, మాదివాడ రత్నారావు, యలవర్తి చిన్నా, గాంధీ క్షేత్రం ప్రధాన కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, లంకమ్మ దేవస్థానం చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, టీడీపీ టౌన్ అధ్యక్షులు అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, కూటమి నాయకులు బండే రాఘవ, కూరాకుల శివప్రసాద్, డేగల రాఘవ, ముళ్ళపూడి శ్రీనివాసరావు, పులిగడ్డ బాలు శ్రీనివాస్, ఆకుల సీతామహాలక్ష్మి, డైరెక్టర్ అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, నాయకులు మండలి రామ్మోహనరావు, లుక్కా వెంకట పిచ్చియ్య, చెన్ను గాంధీ, చెన్ను బాబూరావు, లుక్కా శ్రీనివాసరావు, కొండవీటి గోవిందు, భోగాది బాలకృష్ణ, బడే సుబ్బారావు, ప్రజా సంఘాల కన్వీనర్ నారేపాలెం శంకరరావు, గుగ్గిలం శ్యాంకుమార్, మొగల్ మురాద్ బేగ్, షేక్ బాబావలీ, బషీర్, సోమిరెడ్డి, అన్నపరెడ్డి రామదాసు, సిద్ధాబత్తుని హరినాథబాబు, బడే సుబ్బారావు, యాసం శ్రీరాములు, మైలా హరిబాబు, కొండవీటి పాండురంగారావు, గుడివాక నరహరి, బచ్చు ఆదినారాయణ, గుడివాక రాము, వాహేదుల్లా, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply