జాతీయ భద్రత, పరిశోధనలకు కీలక ఒప్పందం…

జాతీయ భద్రత, పరిశోధనలకు కీలక ఒప్పందం…

ఏర్పేడు, ఆంధ్రప్రభ : దేశ రక్షణ, జాతీయ భద్రత రంగాల్లో అత్యాధునిక సాంకేతికతను పెంపొందించే దిశగా ఐఐటీ తిరుపతి మరో ముందడుగు వేసింది. మానెక్‌షా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అండ్ రీసెర్చ్ తో ఐఐటీ తిరుపతి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రక్షణ రంగంలో పరిశోధనలు, శిక్షణ , అభివృద్ధి కార్యక్రమాలను ఉమ్మడిగా చేపట్టనున్నారు.

​ఒప్పందం ప్రధాన ఉద్దేశాలు : ​సాంకేతిక సహకారం: భారత సాయుధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్), డీఆర్‌డీఓ , ఇస్రో వంటి జాతీయ భద్రతా సంస్థలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం. ​అత్యాధునిక పరిశోధనలు: డిఫెన్స్, ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ విభాగాల్లో ఇరు సంస్థలు కలిసి పరిశోధనలు నిర్వహిస్తాయి. ​పాలనలో భాగస్వామ్యం: ఈ ఒప్పందంలో భాగంగా ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్. సత్యనారాయణ , మానెక్‌షా సెంటర్ గవర్నింగ్ కౌన్సిల్‌లో పేట్రన్ గా వ్యవహరిస్తారు. సెంటర్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక ‘సెంటర్ హెడ్’ను కూడా నియమించనున్నారు. ​

మౌలిక సదుపాయాలు: ఐఐటీ తిరుపతి క్యాంపస్‌లో మానెక్‌షా సెంటర్ కార్యకలాపాలకు అవసరమైన అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ​


కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు : ​ఈ చారిత్రాత్మక ఒప్పంద కార్యక్రమంలో ఐఐటీ గువహటి డైరెక్టర్ ప్రొఫెసర్ దేవేంద్ర జలిహాల్, మానెక్‌షా సెంటర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ సుబ్రత సాహా, సీఓఓ శంఖ సువ్రా భౌమిక్, ఐఐటీ తిరుపతి డీన్ రీసెర్చ్ ప్రొఫెసర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ​ఈ సహకారం దేశ భద్రతా వ్యవస్థలో వినూత్న ఆవిష్కరణలకు బాటలు వేస్తుందని ఐఐటీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Leave a Reply