NATO No అమెరికా ఏకాకే Andhra Prabha Analysis

NATO No అమెరికా ఏకాకే Andhra Prabha Analysis

  • యుద్ధానికి నాటో ,,నో
  • ఇర‌కాటంలో ట్రంప్
  • 7 దేశాలూ వెన‌క్కి .
  • వై దిస్ కొల‌వ‌రీ ..నాటో ప్ర‌శ్న‌

( ఆంధ్ర‌ప్ర‌భ‌, ఎనాల‌సిస్)

ఇజ్రో అమెరికా ఆప‌రేష‌స్ ఎథిక్ ఫ్యూరీ బెడిసి కొట్టిన‌ట్టేనా? ఇరాన్ తాట తీసేద్దాం, హోర్ముజ జ‌ల‌సంది సంగ‌తి తేల్చేద్దాం,, రండి రండి అని అమెరికా అద్య‌క్షుడు పిలుపును ఏడు దేశాలు వినిపించుకోలేదు. ఇందులోని నాటో దేశాలు చాలా నీటుగా అన‌ధికార వీటోతో త‌ప్పించుకున్నాయి. ఇక మిగిలింది చైనా.. ఆ దేశంపై అమెరికా దౌత్య ప‌ర ఒత్తిడి పెంచిన‌ప్ప‌టికీ.. నో చాన్స్ ప‌రిస్థితి క‌నిపిస్తోంది, ప్ర‌పంచ దేశాలను శాసించే పెద్ద‌న్న ఇప్పుడు హెల్ప్‌.. హెల్స్ అనే స్టోగ‌న్ పేలుస్తోంది.

NATO No

ఇజ్రాయెల్ యాక్ష‌న్‌… అమెరికా ఓవ‌ర్ యాక్ష‌న్.. ఇరాన్ రియాక్ష‌న్ పై ప్ర‌పంచ‌దేశాల్లో నెల‌కొన్న స్థితి, గ‌తి ఏమిటీ? ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్దంలో నాటో దేశాలు ఎందుకు స్పందించాయి? ఇప్పుడు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ ఆప‌రేష‌న్ పై ఎందుకు విముఖ‌త ప్ర‌ద‌ర్శిస్తున్నాయి? హోర్ముజా జ‌ల‌సంధిని స్వాధీనం చేసుకోవ‌టా సాధ్య‌మా? అసాధ్యమా? అదే జ‌రిగితే.. నెల‌కొనే ప‌రిస్తితి ఏమిటీ? థ‌ర్డ్ వ‌ర‌ల్డ్ వార్ కు మిత్ర‌దేశాలు బ్రేక్ వేయ‌క త‌ప్ప‌టం లేదా?

NATO No : 7 కంట్రీస్‌.. ఫ్రెండ్లీ సారీ

NATO No

హోర్ముజ్ జ‌ల‌సంధికి ఇరాన్ తాళం వేసింది. స‌మీపంలోని ఫుజైరా టెర్మిన‌ల్‌పై డ్రోన్ల‌తో ఎక్కు పెట్టింది. ఈ జ‌ల‌సంధి రక్షణ కోసం యుద్ధనౌకలను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 7 దేశాలను కోరారు. 5 ప్రధాన దేశాల పేర్లను మాత్రమే ఆయ‌న ప్రస్తావించారు. మధ్యప్రాచ్య చమురుపై ఎక్కువగా ఆధారపడే చైనా (తన చమురు అవసరాల్లో 90% ఇక్కడి నుంచే పొందుతోంది), బ్రిటన్ (UK) ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా దేశాల‌కు అమెరికా అధ్య‌క్షుడు ఆర్డ‌ర్ వేశారు. కానీ ఆ ఆదేశాలు..మాట్లాడ‌లేదు. మాట్లాడినా. వెన‌క‌డుగు వేసినట్టు తెలుస్తోంది. ట్రంప్ హెచ్చరించినా వెంటనే సైనిక సహకారం అందించడానికి ఆయా నిరాకరించాయి.

NATO No

తమ రాజ్యాంగ పరిమితుల దృష్ట్యా యుద్ధనౌకలను పంపే ప్రణాళిక లేదని జపాన్: స్పష్టం చేసింది. తమను ఏ దేశ‌మూ అడగలేదని, నౌకలను పంపే ఉద్దేశం లేదని ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇక అమెరికా అభ్యర్థనను జర్మనీ , నార్వే: నేరుగా తిరస్కరించాయి: తమ నౌకలు కేవలం “రక్షణాత్మక” (Defensive) స్థితిలోనే ఉంటాయని, ప్రస్తుతానికి దాడుల్లో పాల్గొనబోమని ఫ్రాన్స్ తెలిపింది. చమురు రవాణా ముఖ్యమే కానీ , అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమిలో చేరడానికి చైనా: మొగ్గు చూపడం లేదు. బ్రిటన్ స‌హా మిత్రదేశాలు ఇంకా ఈ విషయంలో తటపటాయిస్తూ, చర్చలు జరుపుతున్నాయి.

NATO No : నాటో దూరం

NATO No

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం – అమెరికా జోక్యంపై 32 దేశాల నాటో మౌనం పాటిస్తూ మిశ్రమంగా స్పందిస్తోంది. అమెరికా లక్ష్యాలను రాజకీయంగా నాటో దేశాలు సమర్థిస్తున్నప్పటికీ, ఉక్రెయిన్ విషయంలో చూపిన ఉత్సాహం, శ్ర‌ద్ధ ఇక్కడ చూపడం లేదు. తమ సొంత ఆర్థిక, చట్టపర రాజకీయ కారణాల వల్ల నేరుగా సైనిక జోక్యానికి దూరంగా ఉంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను అధికారికంగా నాటో సంస్థ సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ప్రశంసించారు. ఇరాన్ అణ్వాయుధ సామ‌ర్థ్యం, బాలిస్టిక్ క్షిపణి బ‌లాన్ని తగ్గించడానికి ఈ దాడులు అవసరమని ఆయన పేర్కొన్నారు.

NATO No

అయితే, నాటో ఒక కూటమిగా ఈ యుద్ధంలో నేరుగా పాల్గొనదని (Non-participation) ఆయన స్పష్టం చేశారు. బ్రిటన్ (UK), ఫ్రాన్స్ దేశాలు ఈ ప్రాంతంలో రక్షణ కోసం తమ నౌకలు వాయుసేనలను మోహరించినప్పటికీ, నేరుగా దాడుల్లో పాల్గొనడానికి సుముఖంగా లేవు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వెంటనే యుద్ధనౌకలను పంపడానికి నిరాకరించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జర్మనీ , స్పెయిన్: ఈ దేశాలు యుద్ధం పట్ల మ‌రింత జాగ్రత్త వహిస్తున్నాయి. అమెరికా చర్యలను స్పెయిన్ వ్యతిరేకిస్తుండగా, జర్మనీ ఇప్పుడే ఎటువంటి సైనిక సహకారం అందించలేమని తెలిపింది. కెనడా: చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, మిత్రదేశాలతో సంప్రదింపులు జరుపుతోంది.

NATO No

డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల పట్ల NATO మిత్రదేశాల నుంచి ఇప్పటివరకు మిశ్రమ జాగ్రత్తతో కూడిన స్పందన వస్తోంది. ప్రధానంగా వారు ఈ వివాదంలో నేరుగా తలదూర్చడానికి బదులు దౌత్యపరమైన పరిష్కారాలకే మొగ్గు చూపుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు NATO మిత్రదేశాల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. రష్యా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా సహాయం చేస్తున్నప్పుడు, ఇరాన్ విషయంలో మిత్రదేశాలు ఎందుకు సహకరించవని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. ఆయన చేసిన హెచ్చరికపై కూటమి నాయకులు ఇంకా అధికారికంగా ఉమ్మడి ప్రకటన చేయలేదు.

NATO No : వై దిస్ కొల‌వ‌రీ

గతంలో అమెరికా పిలుపునిస్తే చాలు.. మిత్రదేశాలు ఉరుకులు ప‌రుగులు పెట్టేవి. జీ హుజూర్ అంటూ శాల్యూట్ చేసేవి. కానీ ఇప్పుడు అవి ఊ అన‌టం లేదు. ఊహూ అన‌టం లేదు. తమ సొంత నిర్ణయాలు తామే తీసుకుంటున్నాయి.
NATOకు భవిష్యత్తు ఉండదు వంటి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తే.. ‘బ్లాక్ మెయిలింగ్’ గా మిత్ర ప‌క్షాలు భావిస్తున్నాయి తప్ప ‘నాయకత్వం’ గా గుర్తించ‌టం లేదు. సంక్షిప్తంగా రష్యా విషయంలో “ఉమ్మడి శత్రువు” భయం, ఇరాన్ విషయంలో మిత్రదేశాలకు లేదు. అందుకే అవి అమెరికా మాటను పక్కన పెడుతున్నాయి.
.
NATO No : రష్యాతో ముప్పు భ‌యం

NATO No

ఐరోపా దేశాలకు (NATO) రష్యా పక్కనే ఉంది. రష్యా గెలిస్తే తమ మనుగడకే ప్రమాదమని అవి భ‌య్. అందుకే ఉక్రెయిన్‌కు సహాయం చేశాయి.హోర్ముజ్ జలసంధి సమస్య మధ్యప్రాచ్యానికి సంబంధించింది. అక్కడ యుద్ధం వస్తే చమురు ధరలు పెరిగి తమ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని ఐరోపా దేశాలు భయపడుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలోకి యుద్ధనౌకలు పంపడం అంటే ఇరాన్‌తో నేరుగా యుద్ధానికి దిగడమే. ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణులు, డ్రోన్ల శక్తి తో తమ నౌకలకు నష్టం ఖాయం అని మిత్రదేశాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ గతంలో NATOను విమర్శించారు. “మీ రక్షణ కోసం మేమెందుకు ఖర్చు చేయాలి?” అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయనకు అవసరం వచ్చినప్పుడు మిత్రదేశాలు కూడా అదే ధోరణిలో “మా ప్రయోజనాలు ఏమిటి?” అని ఆలోచిస్తున్నాయి. నిజానికి చమురు ఎక్కువగా చైనా, జపాన్ వంటి దేశాలకు వెళ్తుంది. “వారి కోసం మేం ప్రాణాలు ఎందుకు పణంగా పెట్టాలి?” అనేది బ్రిటన్, ఫ్రాన్స్ త‌దిత‌క దేశాల వాదన.

NATO No : ఒంట‌రిగా దిగితే…

NATO No

ఇరాన్ పై అమెరిఒంటరి పొరుకు దిగితే… ఇక ప్ర‌పంచంలో చయురు ప్ర‌ళ‌యం త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అణ్వాయుధ ముప్పు సంగ‌తి స‌రేస‌రి.. ఇక చ‌మురు ఆక‌లి .. ప్ర‌ప్రంచాన్ని బుగ్గి చేస్తుంద‌ని విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు. ప్రపంచ చమురు ధరలు ప్రళయంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాన కారణం హార్ముజ్ జలసంధి (Strait of Hormuz). ప్ర‌స్తుత పరిస్థితుల ఆధారంగా .. కొన్ని కీల‌క అంశాల‌ను ప‌రిశీలిద్ధాం. అంచనా వేయగల కొన్ని కీలక పరిణామాలు ఇక్కడ ఉన్నాయి:

NATO No : ఆయిల్ ధ‌రకు ఆకాశమే హద్దు

NATO No

ప్రస్తుతం అంత‌ర్జాతీయ మార్కెట్టులో బ్యారెల్ చమురు ధర సుమారు $80-$90 వద్ద ఉంటే, ఇరాన్ తో అమెరికా నేరుగా యుద్ధం షురూ కాగానే $150 నుంచి $200కి చేరుతుంది. హార్ముజ్ జలసంధి నుంచి ప్రపంచంలో వినియోగించే చమురులో దాదాపు 20% (రోజుకు 21 మిలియన్ బ్యారెల్స్) రవాణా అవుతుంది. ఈ మార్గం మూతపడితే సరఫరా నిలిచిపోతుంది. ధరలు విపరీతంగా పెరుగుతాయి.

NATO No : ఆర్థిక మాంద్యం ఖాయం

చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి, దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం (Inflation) తీవ్ర స్థాయికి చేరుతుంది. . ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుంది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలు తీవ్రంగా దెబ్బతింటాయి.

NATO No : ఇరాన్ ‘సూసైడ్ స్ట్రోక్

NATO No

అమెరికా దాడి చేస్తే, ఇరాన్ ఊరికే ఉండదు. హార్ముజ్ జలసంధిలో నౌకలను ముంచేస్తుంది. క్షిపణులతో చమురు ట్యాంకర్లను ధ్వంసం చేస్తుంది. ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తుంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి దేశాల చమురు కూడా నిలిచిపోతుంది. హోర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయం లేదు. సౌదీ అరేబియా యూఏఈలకు కొన్ని పైప్‌లైన్లు ఉన్నప్పటికీ, అవి మొత్తం చమురు రవాణాలో చాలా తక్కువ శాతాన్ని మాత్రమే త‌ర‌లించ‌గ‌ల‌వు.అమెరికా ఒంటరిగా దాడికి దిగితే, మిత్రదేశాల నుంచి మద్దతు లభించకపోగా, చమురు ధరల పెరుగుదలతో కలిగే ఆర్థిక నష్టానికి అమెరికాయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద దెబ్బ అవుతుంది.

ALSO READ : Kharg Island Strike : ఇరాన్ ఆయువు పట్టు ధ్వంసం Andhra Prabha News

Leave a Reply