ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్డూల్ ను ప్రకటించింది. తమిళనాడు, కేరళం, బెంగాల్‌, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాలకు కలిపి 824 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ప్రతి పోలింగ్‌ బూత్‌లో 1200 మంది ఓటర్లకు మించకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో 2.18 లక్షల పోలింగ్‌ కేంద్రాలు, నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలలో కలిపి మెత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు పాల్గొనున్నారు.

అసోంలో రేపు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల, ఈనెల 23 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్‌ 9న పోలింగ్‌, మే 5న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. కేరళంలో ఏప్రిల్‌ 9న ఎన్నికలు, మే 4న ఓట్ల లెక్కింపు , తమిళనాడులో ఏప్రిల్‌ 23న ఎన్నికలు, మే 5వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే బెంగాల్‌లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పొలింగ్, మే 5న కౌటింగ్ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఈ ఐదు రాష్ట్రాలతో పాటు గుజరాత్‌, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్రాల్లోని మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. గోవా, కర్ణాటక, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు మార్చి 16న నోటిఫికేషన్‌ రిలీజ్‌ కానుంది. మార్చి 23 వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు.

ఐదు రాష్ట్రాల్లో మొత్తం 25 లక్షల మంది ఎన్నికల అధికారులు విధులు నిర్వహించనున్నారు. 15 లక్షల మంది పోలింగ్‌ సిబ్బంది, 8.5 లక్షల మంది భద్రతా సిబ్బంది, మొత్తం 2.18 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని సీఈసీ తెలిపింది. పోలింగ్‌, ఈవీఎంలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాం, దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం, దివ్యాంగులు, వృద్ధులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేయాలన్నారు.

ఎన్నికల షెడ్యూల్‌కు ముందు పార్టీల నేతలతో ఈసీ భేటీ జరిగింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటించామని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు పార్టీల నేతల సలహాలు, సూచనలు స్వీకరించామని, జిల్లా ఎలక్టోరల్‌ అధికారులు, ఎస్పీలు, ఐజీలు, డీఐజీలతోనూ భేటీ జరిగిందన్నారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించి బీఎల్‌వోలకు మౌలిక సదుపాయాలు కల్పించాం, పారదర్శక, నిష్పాక్షికంగా ఎన్నికల కోసమే ఎస్‌ఐఆర్‌ నిర్వహణ చేస్తున్నమని సీఈసీ స్పష్టం చేసింది.
పారదర్శక, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశాం, యువత ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కోరారు.

Leave a Reply