పేదల కష్టాన్ని చూసి చలించే నేత పవన్ కళ్యాణ్

పేదల కష్టాన్ని చూసి చలించే నేత పవన్ కళ్యాణ్
- అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
- అవనిగడ్డ కోర్టు సెంటర్లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- పార్టీ జెండా ఎగురవేసి చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
- కేక్ కట్ చేసి పంచిపెట్టిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : పేదల కష్టాన్ని చూసి చలించే నేత పవన్ కళ్యాణ్ అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శనివారం అవనిగడ్డ కోర్టు సెంటర్లో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, టౌన్ అధ్యక్షులు, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతిఏటా రాయపూడి వేణుగోపాల్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి పానకం పంచిపెట్టారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం గురించి పరితపించే నేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని మోడీ చెప్పినట్లు పవన్ కళ్యాణ్ అనే తుఫానులో వైసీపీ కొట్టుకుపోయిందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు వైసీపీ సృష్టించిన అనేక అవరోధాలు ఎదుర్కొని చంద్రబాబుకు బాసటగా నిలిచి బిజెపిని కలుపుకొని కూటమి ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ధీరోదాత్త నేత పవన్ కళ్యాణ్ అని తెలిపారు.

జనసేనకు బలమైన ఓట్ బ్యాంక్ ఉందన్నారు. ఎవరినైనా గెలిపించగల శక్తి, ఓడించగల శక్తి జనసేనకు ఉందని గుర్తించి వ్యవహరించాలని స్పష్టం చేశారు. కూటమిలో అనైక్యత తెచ్చేందుకు కొంతమంది చేసే రెచ్చగొట్టే ప్రయత్నాలపై ప్రతిస్పందించవద్దని సూచించారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా శ్రేణులు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశానికి అనుగుణంగా 15 ఏళ్లు కలిసి ఉండాలనే ఆకాంక్ష నిలబెట్టుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. మహాత్మా గాంధీ ఆకాంక్షించిన గ్రామ స్వరాజ్యాన్ని ఆచరించి చూపిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు.

వైసిపి పరిపాలనలో అధ్వాన స్థితికి చేరుకున్న రహదారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో విస్తృత సంఖ్యలో జరుగుతున్న తారు రోడ్లు, సిమెంట్ రోడ్ల నిర్మాణం గురించి జన సైనికులు గర్వంగా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని రోడ్లు అభివృద్ధి చేసే సంకల్పంతో కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లంకమ్మ దేవస్థానం చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకటనాధ్ ప్రసాద్, చెన్నగిరి సత్యనారాయణ, బాదర్ల లోలాక్షుడు, గుడివాక శివరావు, ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, కటికల వసంత్, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, జిల్లా కర్రసాము అసోసియేషన్ చైర్మన్ సింహాద్రి పవన్, పార్టీ మండల ఉపాధ్యక్షులు తుంగల నరేష్, పీఏసీఎస్ చైర్మన్లు యలవర్తి రాజ నాగ మునేశ్వరరావు, యర్రంశెట్టి సుబ్బారావు, దేవస్థానం డైరెక్టర్లు కోసూరు అవినాష్, మత్తి శివపార్వతి, నాయకులు కమతం నరేష్, యాసం శ్రీరాములు, కమ్మిలి సాయిభార్గవ, ఆళ్లమల్ల చందుబాబు, మాదివాడ రాము, భోగాది శ్రీలక్ష్మి, గుగ్గిలం అనీల్-గాయత్రి, అన్నపరెడ్డి రామదాస్, అన్నపరెడ్డి ఏసు, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
