మాజీ కేంద్రమంత్రి సేవలు మరువలేనివి…

మాజీ కేంద్రమంత్రి సేవలు మరువలేనివి…
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు చేసిన సేవలు మరువలేనివని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ లో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకులు కావూరి సాంబశివరావు భౌతికకాయానికి పూలమాలవేసి ఉదయభాను నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ఎంపీగా, కేంద్రమంత్రిగా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కావూరి సాంబశివరావు చేసిన సేవలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా సాంబశివరావు అంతిమయాత్రలో ఉదయభాను పాల్గొన్నారు.
