మహిళా ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం

మహిళా ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం బెల్లంపల్లి మండలం బోయపల్లి గ్రామంలో మహిళా ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మాసాడి తిరుపతి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు పంచాయతీ సెక్రటరీలను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాసాడి తిరుపతి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో మహిళా ప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్లుల మహేష్, మాజీ సర్పంచ్ మిట్ట వేణుగోపాల్, వార్డు సభ్యులు ఎలిగేటి రమేష్, ఇప్ప శివకాంత్, నాయకులు కనకయ్య, కొమ్మ మల్లేష్, ఇడిగీనాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
