50th Division |కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం

50th Division | కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న..
50th Division | విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పాలన సాగిస్తున్న టీడీసీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు రోడ్డులో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు ప్రజా దర్భార్ కార్యాక్రమాన్ని శనివారం నిర్వహించారు. అధికారులు, టీడీపీ నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు ప్రజల నుంచి నేరుగా విజ్ఞాపనలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారంకు చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న స్వయంగా ప్రజల నుంచి సమస్యలతో కూడిన వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ….పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చొరవతో పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల ముంగిట్లోకే ప్రజా ప్రభుత్వం వచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పార్టీ అధిష్టానం సూచనలతో నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలోనూ ప్రజా దర్భార్ కార్యక్రమాలను ఎంపీ కేశినేని శివనాథ్ ఏర్పాటు చేయించి అన్ని విభాగాలకు చెందిన అధికారులను ప్రజల వద్దకే తీసుకువస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆయా సమస్యల పరిష్కారంకు కృషి చేస్తున్నారన్నారు.

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం టిడిపి ప్రభుత్వంలోనే సాధ్యమని ప్రజా దర్భార్‌లు రుజువు చేస్తున్నాయన్నారు. ప్రజా దర్భార్‌ను ప్రజలంతా వినియోగించుకుని తమ సమస్యలను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నేరుగా అందిస్తున్నారన్నారు. అధికారులు సైతం తక్షణమే స్పందిస్తూ సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకుంటున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. రాష్ట్ర సంక్షేమం, ప్రజలకు సుపరిపాలన టిడిపి ప్రభుత్వం మాత్రమే అందించగలదన్నారు.




CLICK HERE TO READ MORE : అవార్డుతో నా బాధ్యత పెరిగింది… కృష్ణ సమీరా
