వైస్ చైర్మన్ ను సన్మానించిన ఆర్ పి ఐ నాయకులు…

వైస్ చైర్మన్ ను సన్మానించిన ఆర్ పి ఐ నాయకులు…
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన గంధం నరేందర్ ను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా( ఆర్.పి.ఐ) బొజ్జతారకం పార్టీ నాయకులు కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జన్ను సాంబయ్య మాట్లాడుతూ నర్సంపేట పట్టణాన్ని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేయాలని,నర్సంపేట పట్టణంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ద్వారా నూతనంగా ఎన్నికైన నర్సంపేట మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్లు కృషి చేయాలని ఈ సందర్భంగా వారిని జన్ను సాంబయ్య కోరారు. ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా( ఆర్.పి.ఐ) బొజ్జతారకం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడ్ల రవి ముదిరాజ్ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీరాముల పైడి,జిల్లా ప్రధాన కార్యదర్శి గునిగంటి రమేష్,జిల్లా ఉపాధ్యక్షులు మంచాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
