మిస్సింగ్ విద్యార్థి దొరికిండు

మిస్సింగ్ విద్యార్థి దొరికిండు

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించే అదృశ్యమైన పెద్దపోలు నాగవర్ధన్ ఇవ్వాళ కరీంనగర్ పట్టణంలో దొరికినట్లు చెన్నూర్ సీఐ బన్సీలాల్ తెలిపారు.

నిన్న నాగవర్ధన్ తన మిత్రుని పుట్టినరోజు వేడుకకు పాఠశాల సిబ్బంది అనుమతి లేకుండా కరీంనగర్ పట్టణానికి వెళ్లడంతో పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు విద్యార్థి వివిధ రకాలుగా సర్చ్ చేసి కరీంనగర్ లో ఉన్నట్లు తెలుసుకొని తమ సిబ్బందిని పురామయించి కరీంనగర్ నుంచి తీసుకు వచ్చి ఇవ్వాళ సాయంత్రం విద్యార్థి తల్లి దండ్రులకు అప్పచెప్పినట్లు సీఐ పేర్కొన్నారు.

Leave a Reply