భారీ అక్రమ రేషణ్ మాఫియా గుట్టు రట్టు

భారీ అక్రమ రేషణ్ మాఫియా గుట్టు రట్టు
అక్రమంగా నిల్వ ఉంచిన 15 టన్నుల పేదల బియ్యం స్వాధీనం.
నాగాయలంక – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా నాగాయలంకలో వెలుగు చూసిన రేషన్ మాఫియా దందా దివిసీమ రేషన్ అక్రమార్కుల్లో కలకలం రేపింది. నాగాయలంక సబ్బినేని మహేష్ కు చెందిన గోడౌన్ లో నిల్వ ఉంచిన సుమారు 15 టన్నుల రేషన్ బియ్యాన్ని పిడిఎస్ అధికారులు పక్కా సమాచారంతో రైడ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. నేడో రేపో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 300 బస్తాల పిడిఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నట్లు పిడిఎస్ డీటీ కాసిం బాబు మీడియాకు తెలిపారు.
గ్రామ విఆర్వో, విఆర్ఏ, పోలీస్ వారి సమక్షంలో స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సేఫ్ ప్లేస్ కి తరలించి గోడౌన్ యజమాని లీజుకు తీసుకున్న వ్యక్తులపై విచారణ జరిపి 6ఏ కేసు నమోదు చేయనున్నట్లు వివరాలు వెల్లడించారు.

