లిక్విడ్ ట్యాంకర్ ఢీకొని మహిళ మృతి..

లిక్విడ్ ట్యాంకర్ ఢీకొని మహిళ మృతి..

  • లిక్విడ్ ట్యాంకర్ ఢీకొని మృతి చెందిన నాగమల్లేశ్వరి (42)
  • సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై కమలాకర్, ఏఎస్ఐలు

ముండ్లమూరు, ఆంధ్రప్రభ : మండలంలోని పోలవరం పంచాయతీ పరిధిలోని చంద్రగిరి గ్రామానికి చెందిన చంద్రగిరి నాగమల్లేశ్వరి (42) అనే మహిళను బుధవారం లిక్విడ్ ట్యాంకర్ ఢీ కొట్టింది. చంద్రగిరి నాగమల్లేశ్వరి స్కూటర్ పై పొలం వెళుతుండగా లిక్విడ్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో నాగమల్లేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త సుబ్బారెడ్డి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో భర్త సుబ్బారెడ్డి, కుమార్తెలు, బంధువులు బోరున విలపిస్తున్నారు.

మాకు ఇంకెవరు దిక్కు అంటూ కుమార్తెలు తల్లి ప్రత్యేకం పై పడి కన్నీటి పర్యంతం రావడంతో, చుట్టుపక్కల మహిళలు వారిని చూసి కన్నీరు పెట్టుకున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై కె . కమలాకర్, ఏఎస్ఐలు వెంకటేశ్వర్ రెడ్డి, పి.వి. హనుమంతరావు, పవన్ కుమార్ పరిశీలించారు. ఈ సంఘటనపై ఎస్సై కమలాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Leave a Reply