కార్మిక సంఘాల సంయుక్త సమావేశం..

కార్మిక సంఘాల సంయుక్త సమావేశం..

కరిమాబాద్, ఆంధ్రప్రభ : మార్చి 9న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతులు- కార్మికుల పార్లమెంటు నిర్వహించి అందులో భవిష్యత్ పోరాటాలు ఉధృతిపై కార్యక్రమాన్ని రూపొందించబోతున్నట్లు కేంద్ర కార్మిక సంఘాల వేదిక ,సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్తంగా నిర్ణయించినట్లు భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన కేంద్ర కార్మిక సంఘాలు. స్వతంత్ర సమాఖ్యలు. సంయుక్త కిసాన్ మోర్చా ఉమ్మడి వేదిక సమావేశంలో ఈ నిర్ణయం చేయబడిందన్నారు.

కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ,ఫిబ్రవరి 12న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, రైతు పంటలకు గిట్టుబాటు ధరలు కలిగించాలని, విబి-జీ రామ్ జి చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించా లని మొదలైన డిమాండ్స్ కోసం దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మె సందర్భంగా జరిగిన ప్రదర్శనలు సభలు సమావేశాలపై ఈ సమావేశం లో సమీక్షించిందన్నారు.

ఇటీవల కాలంలో జరిగిన ఈ అతి పెద్ద పోరాట కార్యక్రమం 600 జిల్లాలలో అనేక వేల కేంద్రాల్లో 30 కోట్ల మందికి పైగా కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ ఈ సమావేశం అభినందనలు తెలియజేసిందన్నారు. పాలక వర్గాలు అరెస్టులు కేసులు ఎన్ని ఆటంకాలు కలిగించిన వాటన్నిటిని తట్టుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలో పాల్గొని జయప్రదం చేసిన వారందరిని సమావేశం అభినందించిందన్నారు. ప్రభుత్వం రైతు,కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడ నందున భవిష్యత్తులో మరిన్ని పోరాటాలను ఉధృతంగా నిర్వహించేందుకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి మార్చి 9 న ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించిందనీ
వెంకట్రాములు తెలిపారు.

Leave a Reply