WAR | 100మంది గల్లంతు, 78 మందికి తీవ్రగాయాలు..

WAR | 100మంది గల్లంతు, 78 మందికి తీవ్రగాయాలు..
WAR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల మధ్య మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక తీర ప్రాంతంలో ఇరాన్ నేవీకి చెందిన నౌకపై సబ్‌మెరైన్ దాడి జరిగినట్లు శ్రీలంక నేవీ అధికారికంగా వెల్లడించింది. ఈ దాడిలో నౌకలోని 100మంది సిబ్బంది గల్లంతు కాగా, మరో 78 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరాన్ నౌక ఇబ్బందుల్లో పడినట్లు వచ్చిన ‘డిస్ట్రెస్ కాల్’ ఆధారంగా శ్రీలంక నేవీ సహాయక చర్యలు చేపట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
పలువురిని కాపాడినట్లు అధికారులు పేర్కొన్నప్పటికీ, ఈ దాడి ఎవరు చేశారు. దీని వెనుక రహస్యాలు ఏమిటనే ప్రశ్నలు అంతర్జాతీయ సమాజంలో బలంగా లేవనెత్తుతున్నాయి. ఇరాన్ నౌకపై ఈ దాడి యుద్ధ పరిస్థితులను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. గాలె నగర సమీపంలో దక్షిణ తీరానికి కొద్ది దూరంలో ఈ దాడి జరిగింది. క్షతగాత్రులను గాలేలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సబ్‌మెరైన్‌తో దాడి జరిపిందెవరనేది వెంటనే వెల్లడించలేదు.
