210 cases |మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో ధ్వంసం

210 cases | మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో ధ్వంసం

210 cases | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం నాగిడిపాలెంలో పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం సీసా లను రోడ్డు రోలర్ తో తొక్కి ధ్వంసం చేశారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు. ఐదు లక్షల విలువచేసే 1300 అక్రమ మద్యం బాటిళ్లను  ధ్వంసం చేసారు. భీమవరం డివిజన్ లో 210 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 1300 బాటిళ్లను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.

ధ్వంసం చేసిన మద్యం బాటిళ్లలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్యూటీ పెయిడ్ లిక్కర్, తోపాటు నాటుసారాను అధికారులు ధ్వంసం చేసారు. అక్రమ మద్యం విక్రయించిన నాటు సారాం తయారుచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని భీమవరం డిఎస్పి రఘువీర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ లు బలరామరాజు నాగరాజు శ్రీనివాసు, పాలకోడేరు ఎస్సై మంతెన రవి వర్మ, డివిజన్ పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, ఫైర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

210 cases |

Leave a Reply