పాఠశాలకు నూతన డెస్క్ బెంచీల ఏర్పాటు…

పాఠశాలకు నూతన డెస్క్ బెంచీల ఏర్పాటు…
మునుగోడు, ఆంధ్రప్రభ : ‘మన ఊరు–మనబడి’ కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పులిపల్పుల ప్రాథమికోన్నత పాఠశాలలో సుమారు రూ.6 లక్షల విలువైన నూతన డెస్క్ బెంచీలను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, పులిపల్పుల గ్రామ సర్పంచ్ కంభంపాటి జ్యోతి,బీరెల్లి గూడెం సర్పంచ్ దోటి గోవర్ధన్ హాజరై సంయుక్తంగా డెస్క్ బెంచీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు.విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతోందన్నారు.
ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చిత్రం రమేష్, మాజీ వైస్ ఎంపీపీ బోల్గురి నర్సింహ,గ్రామ ఉపసర్పంచ్ అంజయ్య, వార్డు సభ్యులు లింగస్వామి, బిక్షమయ్య,జ్యోతి సాలయ్య,పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.కళావతి, పి ఆర్ టి యు మండల అధ్యక్షులు యూసుఫ్ పాషా, ఉపాధ్యాయులు రవీందర్, రోహిణి, స్వామి, మేరీ, గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.
