ఏజెన్సీలో ఘనంగా హోలీ సంబరాలు

ఉట్నూర్ / జైనూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ కొమురం భీం జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ వేడుకల్లో యువకులు ప్రజలు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు పాల్గొని ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ సంబరాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎంతో ఉత్సాహంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లోప్రజాప్రతినిధులు నాయకులు ఉద్యోగులు వివిధ సంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
