పరిరక్షణ ఉద్యమం కేసు విచారణకు దేవినేని ఉమా హాజరు…

పరిరక్షణ ఉద్యమం కేసు విచారణకు దేవినేని ఉమా హాజరు…
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమంలో భాగంగా గొల్లపూడిలో నిర్వహించిన ధర్నా సందర్భంగా నమోదైన కేసు విచారణ నిమిత్తం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు కూడా కోర్టుకు హాజరయ్యారు.
గొల్లపూడిలో అమరావతి పరిరక్షణ కోసం నిర్వహించిన నిరసన కార్యక్రమంపై అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసిందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం కోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ న్యాయవాది చేకూరి శ్రీపతి, న్యాయవాది నవీన్ తరఫున వాదనలు వినిపించారు. కేసు నమోదు విధానం, చట్టపరమైన అంశాలపై వారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం.
