పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలి..

పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలి..

  • పింఛన్లను అందిస్తున్న కలెక్టర్ చదలవాడ నాగరాణి
  • పశ్చిమలో 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లు పంపిణీ
  • కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. నరసాపురం పట్టణం 15వ వార్డు మసీదు సెంటర్ వలవల వారి వీధి, బొండమ్మ మహిళ వృద్ధుల ఆశ్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. లబ్ధిదారులను ఆపాయ్యతగా పలకరించి పింఛన్లు, పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మార్చి ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 28నే పింఛన్లను అందజేయడం జరుగుతోందన్నారు.

District Collector

ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా అంతటా 24 రకాల పింఛన్లకు సంబంధించి 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లు పింఛన్లు పంపిణీ నేడు పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. పించన్లుకు పంపిణీలో ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత మున్సిపల్ కమిషనర్లు లేదా ఎంపిడిఓ లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పీ.డి ఎం.ఎస్.ఎస్. వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ ఆర్.వెంకట రామిరెడ్డి, డిపిఎం శ్రీనివాస్ ప్రసాద్, ఏపిఎం జె.నాగభూషణం, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply