మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన మున్సిపల్ కౌన్సిలర్..

మక్తల్ , ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్ర పాడి, పశుసంవర్ధక, డెయిరీ, క్రీడా, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని శుక్రవారం మక్తల్ మున్సిపల్ 16వ వార్డ్ కౌన్సిలర్ అల్కూరి పావని, కాంగ్రెస్ పార్టీ మక్తల్ పట్టణ అధ్యక్షులు అల్కూరి రవికుమార్ పూలకుండీ ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 16వ వార్డ్ లో పలు అభివృద్ధి పనుల గురించి మంత్రి వద్ద ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి మంత్రి భరోసా ఇచ్చారని, ఇప్పటికే సీసీ రోడ్లు డ్రైనేజీలు, తాగునీటి పైప్ లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈసందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరికి వార్డు ప్రజలు, స్థానిక నాయకుల తరపున ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి, స్థానిక వార్డు తోపాటు మక్తల్ మున్సిపాలిటీ ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు మంత్రి వాకిటి శ్రీహరి కృత నిశ్చయంతో ఉన్నారని, ప్రతి ఒక్కరి తరపున పేరు పేరునా మంత్రి వాకిటి శ్రీహరికి ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు.
