పేదలకు ఆర్థిక చేయూత సీఎంఆర్ఎఫ్

పేదలకు ఆర్థిక చేయూత సీఎంఆర్ఎఫ్

  • పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా
  • పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి

తొర్రూరు, ఆంధ్రప్రభ : ఆపత్కాలంలో పేదలకు ఆర్థిక చేయూత సీఎంఆర్ఎఫ్ అని
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.తొర్రూరు పట్టణంతోపాటు,మండలంలోని పలు గ్రామాలకు చెందిన 87 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.43 లక్షల 50వేల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ఆర్థికంగా, వెనుకబడిన వర్గాలకు వైద్య చికిత్సల నిమిత్తం అత్యవసర సమయంలో ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. సీఎం ఆర్ఎఫ్ ద్వారా అనేక కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందన్నారు. ప్రజారోగ్యానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందన్నారు.పెద్ద మొత్తంలో సీఎం ఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని తెలిపారు.

నియోజకవర్గంలో ప్రజలు ప్రమాదాల బారిన పడితే తమ దృష్టికి తీసుకురావాలని, గ్రామాలలో సీఎం ఆర్ఎఫ్ సద్వినియోగించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పింగిలి ఉష, సర్పంచ్ శీను నాయక్, కౌన్సిలర్ ముధసాని సురేష్,కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, మహబూబ్ రెడ్డి, సోమిరెడ్డి దేవేందర్ రాజు, పంజా కల్పన, రమేష్ గౌడ్, వెంకన్న యాదవ్, మహేష్ యాదవ్,ఎర్రం రాజు, బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply