ఐఐటీ ర్యాంకర్స్ కు అభినందనలు..

ఐఐటీ ర్యాంకర్స్ కు అభినందనలు..
ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని శ్రీ వేంకట బాల్ రామయ్య ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులు ప్రతిభను చాటారు. పాఠశాల విద్యార్థి మహేశ్వర్ రెడ్డి 9వ, తరగతి అపెక్స్ ఐఐటీ, జెఈఈ నీట్, ఒలంపియాడ్ రాష్ట్ర స్థాయి టెస్ట్ లో 2వ ర్యాంక్ సాధించాడు. సాయి చరణ్ 8వ తరగతి జోనల్ 9వ ర్యాంక్ సాధించారు. విద్యార్థుల విజయం పట్ల పాఠశాల చైర్మన్ సామల తిరుపతయ్య విద్యార్థులను అభినందించారు. జీవితంలో మరిన్ని విజయాలు సాదించాలని సూచించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సామల బాల్ రాజు మాట్లాడుతూ.. జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను సాధించే దిశగా ప్రయత్నం చేయాలని తెలిపారు. ఇంతటి విజయంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జార్జ్ జోసెఫ్, వైస్ ప్రిన్సిపాల్ రామ్ పెరుమాండ్ల, ఐఐటీ ఉపాధ్యాయులు సిద్దార్ధ, ఖాదర్, మల్లేష్, అశోక్, హాబీ బున్నేసా తదితరులు పాల్గొన్నారు.
