108 Ambulance | వాష్‌రూమ్‌లోనే….

108 Ambulance | వాష్‌రూమ్‌లోనే….

108 Ambulance | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పరీక్షా కేంద్రంలోనే ఓ విద్యార్థిని ప్రసవించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా పిథాంపూర్‌లో చోటుచేసుకుంది. పదో తరగతి గణితం పరీక్ష రాస్తున్న ఓ మైనర్ విద్యార్థిని పరీక్షా కేంద్రంలోని వాష్‌రూమ్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. కడుపునొప్పితో వాష్‌రూమ్‌కు వెళ్లిన ఆమె అక్కడ ప్రసవించింది. పసికందు ఏడుపు విని అప్రమత్తమైన సిబ్బంది విషయాన్ని గుర్తించారు.

వెంటనే పరీక్షా కేంద్రం యాజమాన్యం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించింది. తల్లీబిడ్డను హుటాహుటిన స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలు ఇండోర్ జిల్లాలోని బెత్మా ప్రాంతానికి చెందినది కావడంతో కేసును అక్కడి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ధార్ ఏఎస్పీ విజయ్ దబూర్ తెలిపారు.

Leave a Reply