అభ్యుదయ కవి లింగారావుకు సాహితీ పురస్కారం

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన సామాజిక రచయిత, అభ్యుదయ కవి కొండా లింగారావు కు విశ్వసాహితీ కళావేదిక వారు నిర్వహించిన కవితల పోటీలో టాప్ 20 విజేత గా నిలిచారు. జానపద అకాడమీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సౌజన్యంతో పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు కవుల మహాసభలలో లింగారావు కు సాహితీ పురస్కారం అందజేసి శాలువాతో సత్కరించి సర్టిఫికెట్ షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా కొండా లింగారావును ప్రపంచ కవిత్వంలో కవిత్వమే తమ ప్రపంచంగా జీవిస్తూ మానవ వికాసానికి, సమాజ ప్రకాశానికి తెలుగు భాషా సౌందర్యాన్ని జాతి ఔన్నత్యాన్ని రచనలలో కొనసాగిస్తున్న తెలుగు పలుకు తేనె లోలుకు మాతృభాష పట్ల సాహితీ కవులు చేస్తున్న రచనలను పలువురు కళాకారులు, తెలుగు కవులు, వివిధ సంఘాల నాయకులు అభినందించారు.

Leave a Reply