ఉచిత వైద్య శిబిరం

ఉచిత వైద్య శిబిరం
మామడ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని పొన్కల్ గ్రామంలో ఆదివారం శ్రీ కృష్ణ న్యూరో హాస్పిటల్ నిర్మల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు భవాని వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ అనంతరం నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన చిట్యాల లక్ష్మి రాజారెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మి రాజారెడ్డి, స్థానిక వైద్యులు బద్రి భూమేశ్వర్,వైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
