Kurnool | అసత్య ఆరోపణలు చేస్తున్నారు…

Kurnool | అసత్య ఆరోపణలు చేస్తున్నారు…

Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల, నగర, పట్టణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించబడింది. సమావేశానికి గుడిసె ఆది కృష్ణమ్మ అధ్యక్షత వహించారు. కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పి. కప్పట్రాళ్ల బొజ్జమ్మ, రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్ రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

జిల్లాలోని వివిధ మండలాల నుంచి పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గ శాసనసభ్యులు, ఇన్‌చార్జిల సహకారంతో గ్రామ, వార్డు, బూత్, క్లస్టర్ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి నాయకుడు తన పరిధిలో పార్టీ నిర్ణయాలను ప్రజలకు వివరించి మమేకం కావాలని కోరారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పేటీఎం బ్యాచ్ ద్వారా కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారని విమర్శించారు.

Kurnool |

అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మండల స్థాయి నాయకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ, తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధుల జమ, రైతు భరోసా ద్వారా రైతులకు ఆర్థిక తోడ్పాటు వంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

Kurnool |

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, పోలీసు ఉద్యోగాల నియామకాలు, ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటినీ ప్రజలకు సవివరంగా తెలియజేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని నాయకులు కోరారు.

Kurnool |

సమావేశంలో అమర్నాథ్ గౌడ్, పి. దామోదర్, కెటి వెంకటేష్, కాశిం వలి, మహేష్ కుమార్, తిమ్మప్ప, బోయ తిరుపతయ్య, జి. మల్లికార్జున, సి. సురేష్ నాయుడు, పల్లెపాడు రామిరెడ్డి, కే. శ్రీనివాసులు, కే. పురుషోత్తం, కే. శివప్ప, ప్రసన్న లక్ష్మి, జి. కిష్టయ్య, గురుస్వామి, రాజేష్, నర్సింలు, వెంకటరమణ, రామాంజనేయులు, పట్టాభి, కే. రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply