Development |అందరం కలిసి బెల్లంపల్లిని అభివృద్ధి చేద్దాం!

Development |అందరం కలిసి బెల్లంపల్లిని అభివృద్ధి చేద్దాం!
బీఆర్ఎస్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంలో చైర్‌పర్సన్ దావ స్వాతి పిలుపు
Development | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: పట్టణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కౌన్సిలర్లందరూ కలిసికట్టుగా పనిచేయాలని బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి-రమేష్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిశాయని, ఇప్పుడు మన ముందున్న ఏకైక లక్ష్యం బెల్లంపల్లి అభివృద్ధి మాత్రమేనని స్పష్టం చేశారు.
మనం ఏ పార్టీ నుంచి గెలిచినా, ఇప్పుడు మనమంతా ప్రజల ప్రతినిధులం. అందరం కలిసికట్టుగా కృషి చేసి మన పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం” అని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో వార్డుల్లో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించి, బెల్లంపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.
మున్సిపల్ కమిషనర్ సంపత్, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణల సమక్షంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొయ్యడ ప్రసన్న (1వ వార్డు), లక్కాకుల సౌజన్య (3వ వార్డు), ఈట కమల (4వ వార్డు), గోగర్ల స్వప్న (5వ వార్డు), నల్లా కృష్ణవేణి (6వ వార్డు) బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు కాంపెల్లి రాజం (9వ వార్డు), తిరుమల వాసు (12వ వార్డు), దొంగల రాజ్ కుమార్ (13వ వార్డు), ఆసాది మధుకర్ (14వ వార్డు), బత్తుల అనిత (18వ వార్డు), షేక్ సుమ్రాన్ (19వ వార్డు), తాండ్ర స్రవంతి (20వ వార్డు), రాజనాల రమేష్ (21వ వార్డు), బండారి స్రవంతి (31వ వార్డు) కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు.
